07 November 2025

ఈ అందమేంటీ మేడమ్.. 47 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్లకు పోటీగా..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం దక్షిణాది హీరోలకు జోడిగా నటిస్తూ దూసుకుపోతున్న హీరోయిన్ మంజు వారియర్. 47 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తుంది ఈ అమ్మడు.

చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చి అందం, అభినయంతో కట్టిపడేస్తుంది.

నిత్యం స్టైలిష్, మరింత యవ్వనంగా కనిపిస్తుంది. అయితే ఈ వయసులోనూ కుర్రహీరోయిన్లకు పోటీగా ఫిట్నెస్, అందంతో కనిపించడానికిగల కారణాలు రివీల్ చేసింది.

తన ఫిట్నెస్ సీక్రెట్ విషయంలో అధిక ప్రాధాన్యత డ్యాన్స్ అని తెలిపింది. నిత్యం మానసిక ప్రశాంతతతోపాటు శారరీకంగా ఉత్సహంగా ఉండేందుకు డ్యాన్స్ చేస్తుందట. 

పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటదట. ఇంట్లో వండిన ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడతానని..నూనే పదార్థాలకు దూరంగా ఉంటుందట.

అలాగే అధికంగా తీపిగా ఉండే పదార్థాలకు సైతం దూరంగా ఉంటుందట. చిన్నప్పటి నుంచే డ్యాన్స్ నేర్చుకోవడంతోపాటు రోజూ ఆరోగ్యంగా, ఫిట్నెస్ కోసం డ్యాన్స్ చేస్తుందట.

డ్యాన్స్ మాత్రమే కాకుండా రోజూ యోగా, కఠిన వ్యాయామాలు సైతం చేస్తుందట. రోజూ శరీరానికి శ్రమను అందిస్తూ వ్యాయమాలు చేయడంతో ఆరోగ్యంగ ఉంటారట. 

మంజుకు ఎక్కువగా జిమ్ చేయడం నచ్చదు. అందుకే ఆమె నడవడానికి ఆసక్తి చూపిస్తుంది. ప్రతిరోజూ గంటపాటు నడుస్తుంది. తన డైట్, ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.