12 మందితో డేటింగ్.. ఒకరితో పెళ్లి కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా 

Rajeev 

23 November 2024

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్స్, పెళ్లి, విడాకులు చాలా కామన్ అయ్యాయి. కొంతమంది హీరోయిన్స్ ఎఫైర్స్‌తో ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటారు. 

ఈ హీరోయిన్ ఏకంగా 12మందితో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచింది. టాప్ హీరోయిన్ గా సత్తా చాటిన నటి.. కానీ కెరీర్ లో ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొంది. 

12మందితో ప్రేమాయణం సాగించినా కూడా అవి ఏవీ కూడా ఎక్కువకాలం నిలవలేదు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే భర్తతో విడిపోయింది.

ఇంతకూ ఆమె ఎవరో కాదు.. మనీషా కొయిరాలా. ఈ బ్యూటీ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12మందితో ప్రేమలో పడింది ఈ బ్యూటీ. 

హీరోయిన్ గా రాణించిన ఈ అమ్మడు పలువురు హీరోలతో డేటింగ్ చేసిందని వార్తల్లో వచ్చింది. కానీ అవి సక్సెస్ కాలేదు. 

2010లో నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహల్‌ను మనీషా కోయిరాల వివాహం చేసుకుంది. కానీ ఆ పెళ్లి కూడా పెటాకులైంది. 

ఆతర్వాత క్యాసర్ తో పోరాడింది. ఆ తర్వాత దాని నుంచి కోలుకుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో అడపాదడపా సినిమాలు చేస్తోంది.