అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజపుట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మంగళవారం’. ఆర్ఎక్స్ 100 తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది.
ఈ చిత్రాన్ని స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్100 మూవీ హిట్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.
మంగళవారం సినిమాలో పాయల్ తో పాటు అజయ్ ఘోష్, చైతన్య కృష్ణ, శ్రీతేజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.
ఈ మూవీ నవంబర్ 17న ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్ ని కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఆ పోస్టర్ లో డీగ్లామర్ గా ఓ పల్లెటూరి అమ్మాయిలా ఆకట్టుకుంది హీరోయిన్ పాయల్. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ కూడా ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చారు. మాధవ్ కుమార్ కంపోజ్ చేశారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం అందించారు.
ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి అన్నారు చిత్ర దర్శకుడు అజయ్ భూపతి.