31 January 2025

కండోమ్స్ యాడ్‏కు ఆ హీరోయిన్ కరెక్ట్ ఛాయిస్.. కామెంట్స్ దుమారం.. 

Rajitha Chanti

Pic credit - Instagram

సాధారణంగా సినీరంగంలోని నటీనటులు అందరూ పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుంటారన్న సంగతి తెలిసిందే.

కానీ కొందరు స్టార్ హీరోహీరోయిన్స్ కొన్ని ప్రకటనలు చేసేందుకు అసలు ఆసక్తి చూపించరు. అలాంటి వాటిలో కండోమ్ యాడ్ ఒకటి. 

అయితే తాజాగా మ్యాన్‌ఫోర్స్ కండోమ్ కంపెనీ ఎండీ, సహ వ్యవస్థాపకుడు రాజీవ్ జునేజా ఓ హీరోయిన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ జునేజాకు.. జాన్వీ కపూర్, రణబీర్ ఇద్దరిలో కండోమ్ ప్రకటనకు ఎవరు సరిపోతారని ప్రశ్నించారు. 

అయితే హీరోయిన్లలో కండోమ్ యాడ్ కోసం జాన్వీ కపూర్ బెస్ట్ ఛాయిస్ అని.. పురుషులలో రణబీర్ కపూర్ బెస్ట్ ఛాయిస్ అంటూ చెప్పుకొచ్చారు. 

అయితే రాజీవ్ కామెంట్స్ పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ మరికొందరు మాత్రం అతడి మాటలకు మద్దతు తెలుపుతూ సపోర్ట్ చేస్తున్నారు. 

అది రాజీవ్ జునేజా వ్యక్తిగత అభిప్రాయం అని.. ఇందులో అభ్యంతరకం ఏమి లేదని అతడికి మద్దతు తెలుపుతున్నారు. సెలబ్రెటీలు చాలా యాడ్స్ చేస్తున్నారు.

ఇటీవలే ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో ఈ బ్యూటీ నటిస్తుంది.