కన్నప్ప తాజా అప్‌డేట్.. కెప్టెన్ మిల్లర్ నుంచి కొత్త పాట..
26 December 2023
TV9 Telugu
మంచు విష్ణు లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న హిస్టారికల్ చిత్రం కన్నప్ప తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది.
భారతదేశంలోని అగ్రనటులతో పాటు 600 మంది హాలీవుడ్ టెక్నిషియన్స్ తో 90 రోజుల పాటు ఈ షెడ్యూల్‌లో వర్క్ చేసినట్టుగా వెల్లడించారు మేకర్స్.
ప్రభాస్ శివుడు పాత్రలో కనిపించనున్నారు. మహాభారత్ టీవీ సీరియల్ ఫేం ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గ్రాండ్‌గా జరిగింది.
ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వ్యూహం సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ధనుష్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయక.
అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
కెప్టెన్ మిల్లర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి