మొదలైన మనోజ్ ఉస్తాద్.. పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..
14 December 2023
తెలుగులో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు మంచు మనోజ్ ఇప్పుడు వ్యాఖ్యాతగా మారిపోయారు.
మంచు మనోజ్ హోస్టుగా వస్తున్న తొలి షో ఉస్తాద్. తాజాగా దీని మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వచ్చింది.
తొలి ఎపిసోడ్‌కు నాని అతిథిగా వచ్చారు. ఈ ఇద్దరి ముచ్చట్లు వైరల్ అవుతున్నాయిప్పుడు. డిసెంబర్ 15న మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుంది.
పవన్ కళ్యాణ్ సినిమాల గురించి అభిమానులు ఆసక్తి చూపించడం ఎంత సాధారణమైన విషయమో.. దర్శక నిర్మాతలు అవి లేవు అని చెప్పడం కూడా అంతే సాధారణం.
ఇప్పుడు మరోసారి ఇదే జరిగింది. డివివి ఎంటర్‌టైన్మెంట్స్ అయితే ఏకంగా ఓజి అప్‌డేట్స్ ఏం లేవంటూ ట్వీట్ చేసారు.
షూటింగ్ ఆపేసామని.. ఇప్పట్లో ఏం కొత్త కబుర్లు లేవని తేల్చేసారు వాళ్లు. అదే సమాచారం హరిహర వీరమల్లు యూనిట్ నుంచి కూడా అందుతుంది.
మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం అభిమానులే కాదు.. మామూలు ప్రేక్షకులు కూడా ఎంత ఆసక్తిగా వేచి చూస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ క్రమంలోనే సినిమా కోసం ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్సుల కోసం మహేష్ బాబు శిక్షణ. అన్నీ కుదిర్తే ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టి 2025లో విడుదల చేయాలని చూస్తున్నారు.