మా అక్కను చూస్తే చాలా గర్వంగా ఉంది.. మనోజ్ పోస్ట్ వైరల్
మంచు లక్ష‍్మీ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు.
ఎందుకంటే ఆమె చాలా నార్మల్‌గా మాట్లాడినా సరే ఆ కామెంట్స్, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.
దీంతో ఫన్నీగానే ఆమెని ట్రోల్ చేస్తుంటారు.
ఇదంతా పక్కనబెడితే ఆమె మంచి పనులు కూడా చాలానే చేస్తోంది.
కాకపోతే అవి తక్కువగా హైలెట్ అవుతున్నాయి.
కొన్నాళ్ల ముందు మంచు లక్ష‍్మీ చేసిన ఈ మంచి పని గురించి ఆమె తమ‍్ముడు ఇన్ స్టాలో ఇప్పుడు పోస్ట్ పెట్టాడు.
'మా అక్కని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 30 స్కూల్స్ ని దత్తత తీసుకుంది.
ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈ విషయమై సహాయం చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు' అని మంచు మనోజ్ రాసుకొచ్చాడు.
దీంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇక్కడ క్లిక్ చేయండి