కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబుకు వారసుడిగా.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. నిన్న మొన్నటి వరకు హీరోగా సినిమాలు చేసిన మంచు మనోజ్.. ఇప్పుడు గేర్ మార్చాడు.
తన తండ్రిలాగే విలన్ క్యారెక్టర్స్ చేసేందుకు రెడీ అయిపోయాడు. యంగ్ హీరో తేజా సజ్జా పాన్ ఇండియా మూవీలో.. విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు మంచు మనోజ్.
ఆఫ్టర్ హనుమాన్ సూపర్ డూపర్ హిట్.. తేజా సజ్జా.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో మిరాయ్ సినిమా చేస్తున్నాడు.
హై బడ్జెట్‌తో.. పాన్ ఇండియా రేంజ్‌లో.. యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా చేస్తున్నాడు.
అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన మిరాయ్ గ్లింప్స్‌లో.. హీరో క్యారెక్టర్‌ను... సినిమా కథను ఇన్ షార్ట్‌గా చెప్పే ప్రయత్నమే చేశారు కానీ.. విలన్ ఎవరన్నది రివీల్ చేయలేదు మేకర్స్.
కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. మనోజ్ పుట్టిన రోజైన మే20న మంచు మనోజ్‌కు సంబంధించిన లుక్‌ను కానీ.. స్పెషల్ టీజర్‌ను కానీ రిలీజ్ చేయనున్నారట మేకర్స్.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18, 2025 న వరల్డ్ వైడ్ గా 2డి మరియు 3డి ఫార్మాట్ల లో రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.