అప్పుడే 'కన్నప్ప' రిలీజ్.. శింబు కొత్త సినిమా లుక్..

TV9 Telugu

05 February  2024

మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌ అయిన 'మహా భారతం' సీరియల్‌ను తీసిన ముఖేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది దసరాకు విడుదల కానుందని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ మహా శివుడిగా, నయనతార పార్వతిగా కనిపించనున్నారు.

హీరో కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై శింబు హీరోగా ఓ సినిమా వస్తుంది.

ఫిబ్రవరి 2న శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు మూవీ మేకర్స్.

ఈ ఫస్ట్ లోక్ పోస్టర్ సినిమాపై అంచనాలు బాగా పెంచేసింది. ఇందులో డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నారు శింబు.

ఇదొక డిఫరెంట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాగా వస్తుంది. దేసింగ్ పెరియసామి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.