గూస్ బంప్స్.. ఇది కదా కామ్ బ్యాక్ అంటే..

TV9 Telugu

23 May 2024

తేజా సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా మిరాయ్. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమా రూపొందుతుంది.

హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో తేజ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తేజకి జోడిగా రితికా నాయక్ కథానాయికగా నటిస్తుంది .పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో టీ.జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. అశోక సీక్రెట్ 9లో పోరాడే సూపర్ యోధ పాత్రలో తేజ సజ్జ నటిస్తున్నారు.

ఈ చిత్రం అశోకుడు కాలంలో కళింగ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతుంది. మంచు మనోజ్ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఇందులో ప్రతినాయకుడిగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్నారు. తాజాగా అయన పుట్టినరోజు సందర్భంగా ఓ గ్లింప్స్ విడుదల చేసారు.

ది బ్లాక్ స్వర్డ్ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మనోజ్ క్రేజీ కామ్ బ్యాక్ అంటూకామెంట్స్ పెడుతున్నారు.

మిరాయ్ సినిమా ఎప్రిల్ 18, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో 2D, 3Dలో విడుదల కానుంది.