TV9 Telugu
భ్రమయుగంకి భారీ వసూళ్లు.. మరో డిఫరెంట్ రోల్‌లో మమ్ముట్టి..
27 Febraury 2024
మలయాళీ సీనియర్ స్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ భ్రమయుగం.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ భారీ వసూళ్లతో దూసుకుపోతుంది.
ఇప్పటికే 50 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, YNOT స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి.
ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీని బ్లాక్ అండ్ వైట్‌లో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు రాహుల్ సదా శివన్ దర్శకుడు.
భ్రమయుగం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మమ్ముట్టి మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
టర్బో పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. యాక్షన్-కామెడీ చిత్రంగా తెరకెక్కుతుంది.
మమ్ముట్టి జైలులో ఖైదీలా, కింద కూర్చొని ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్ అభిమానులకు ఆకట్టుకుంది.
వైశాఖ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు నటుడు సునీల్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి