ఒకే ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ కుట్టి. దీంతో సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్స్ ఖాతాలో చేరింది మమితా బైజు.
ఇటీవల మలయాళంలో ప్రేమలు సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
ఇటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో రీను పాత్రలో కనిపించిన మమితా సౌత్ కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది.
దీంతో ఈబ్యూటీకి సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తమిళం, తెలుగు, మలయాళంలో ముద్దుగుమ్మతో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్.
ఈ క్రమంలోనే మమితాకు షాక్ తగిలింది. భారీ హిట్ అందుకుని ఫుల్ ఫాంలో ఈ బ్యూటీ ఇటీవల తమిళంలో రెబల్ సినిమాలో నటించింది. మార్చి 22న విడుదలైంది.
అయితే తొలిరోజే ఈమూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. దాదాపు రూ. 40 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ రావడం లేదు. డైరెక్షన్ పై పెదవి విరుస్తున్నారు అడియన్స్.
అలాగే ఇందులో మమితా బైజు పాత్రకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. మార్చి 22న రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మమితా ఖాతాలో డిజాస్టర్ చేరింది.
ఇప్పుడిప్పుడే క్రేజ్ అందుకుని.. రెమ్యూనరేషన్ పెంచే ఆలోచనలో ఉన్న మమితాకు ఇది పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఆమె నటించిన ప్రేమలు హిట్ కాగా.. రెబల్ డిజాస్టర్ అయ్యింది.