26 October 2025
ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల రెమ్యునరేషన్.. మమితా రియాక్షన్ ఇదే..
Rajitha Chanti
Pic credit - Instagram
మలయాళీ చిత్రపరిశ్రమలో చాలా సంవత్సరాలు సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఇప్పుడిప్పుడే క్రేజ్ సంపాదించుకుంటుంది కేరళ కుట్టి మమితా బైజు.
ప్రేమలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. అదే సినిమాతో తెలుగులో రిలీజ్ కావడంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
తాజాగా తమిళంలో డ్యూడ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో కథానాయికగా మమితా బైజు నటించింది. అయితే ఈ సినిమా కోసం ఆమె రూ.15 కోట్ల పారితోషికం తీసుకుందని టాక్ వినిపించింది.
ఈ క్రమంలో తన రెమ్యునరేషన్ గురించి వచ్చిన వార్తలపై స్పందించింది మమితా. రూ.15 కోట్లు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని తెలిపింది.
సోషల్ మీడియాలో తాను అంత యాక్టివ్ గా ఉండనని.. తన గురించి వస్తున్న కథనాలు, వ్యాఖ్యలు చూసి షాకయ్యానని.. చాలా మంది వాటిని నమ్ముతున్నారు.
సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోవడం రికార్డ్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ నేను అంత పారితోషికం తీసుకున్నట్లు వస్తున్న టాక్ అబద్ధం.
నన్ను పెద్ద హీరోయిన్ అనుకుంటున్నారా ? నాకు అర్థం కావడం లేదు అంటూ తన రెమ్యునరేషన్ పై వస్తున్న వార్తలపై మమితా అసహనం వ్యక్తం చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్