ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ 'ప్రేమలు'

TV9 Telugu

04 April 2024

మలయాళ సినిమాల గురించి ఇప్పుడు ఇండియన్‌ సినిమా మొత్తం మాట్లాడుకుంటోంది. తక్కువ బడ్జెట్ లో తీసి ఎక్కువ విజయాలను అందుకుంటున్నాయి.

అయితే రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, రూ.85 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది అంటే మాట్లాడుకోవడం తప్పేం లేదు కదా.

మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న సినిమా ‘ప్రేమలు’.  ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులో మార్చి 8న వచ్చింది. 

కొత్త‌ త‌రం ప్రేమ‌క‌థ‌తో, హైద‌రాబాద్ నేప‌థ్యంలో రూపొందిన ప్రేమలు సినిమా యువతను విశేషంగా ఆకట్టుకున్నది.

అలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఇటీవలే తెలుగు వెర్షన్‌ రిలీజైనా థియేటర్‌ రన్‌ అయిపోయిందంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రేమలు సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసేశారు. ఇది ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ చేయనున్నారు.

 ఏప్రిల్‌ 12 నుండి ‘ప్రేమలు’ స్ట్రీమింగ్‌ మొదలు కానుంది. ‘ఇప్పుడు ఈ ప్రేమ మరింత వైరల్‌ అవుతుంది’ అంటూ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు.