డెవిల్ నుంచి మాళవిక లుక్ విడుదల..
16 October 2023
కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్న సినిమా డెవిల్. ఈ మూవీలో సంయుక్త మీనన్ కథానాయకిగా కనిపించనుంది.
పీరియడ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న మూవీని శ్రీకాంత్ విస్సా రచించగా.. నవీన్ గౌడ్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు.
అభిషేక్ నామా, దేవాన్ష్ నామా సంయుక్తంగా అభిషేక్ పిక్చర్స్ పథకంపై భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సౌందర్ రాజన్ అందించారు. ఎడిటర్ గా తమ్మిరాజు పని చేశారు.
ఈ చిత్రంలో హీరోయిన్ మాళవిక నాయర్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు ఈమెకు సంబంధించిన ఓ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
మాళవిక మైక్ ముందు నిలబడి స్పీచ్ ఇస్తూ కనిపిస్తున్న ఆ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఆమె రోల్ పేరు మణిమేఖల అని తెలిపారు.
నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఈ టీజర్, పోస్టర్స్, పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పటినుంచి మొదలు కానున్నాయో త్వరలో తెలపనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి