రామ్ చరణ్ సినిమాలో రాజాసాబ్ బ్యూటీ.. చెర్రీ జోడిగా మాళవిక ?..
Rajitha Chanti
Pic credit - Instagram
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో మరో బ్యూటీ ఉందట.
ఆర్సీ 16 సినిమాలో మాళవిక చరణ్ సరసన కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. చెర్రీకి జోడిగా ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఫిల్మ్ సర్కిల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.
అయితే రామ్ చరణ్ సరసన మాళవిక నటించనుందనే వార్తలలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. నెట్టింట వైరలవుతున్న వార్తలలో నిజం తెలియాలంటే మేకర్స్ నుంచి స్పష్టత రావాలి.
ప్రస్తుతం మాళవిక రాజాసాబ్ సినిమాలో నటిస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ మారుతి కాంబోలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో మాళవిక కథానాయికగా నటిస్తుంది.
ఇప్పటికే మాళవికకు సంబంధించిన యాక్షన్ సీన్ వీడియోస్ లీక్ అయ్యాయి. మొదటిసారి ప్రభాస్ జోడిగా కనిపించనుంది మాళవిక. ఆ తర్వాత ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు.
మాళవిక మోహనన్ కు అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. అటు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్.
ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ నెట్టింట పంచుకుంటుంది. ఇటీవల గోల్డ్ కలర్ డ్రెస్సులో బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
2013లో పట్టంపోల్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు సినిమాలు చేసింది. అయినా ఈ బ్యూటీకి గుర్తింపు రావట్లేదు.