టాలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహనన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనకు వచ్చిన పరిస్థితి గురించి ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.
చెన్నై ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనపై చెప్పుకొచ్చింది. తాను జైపూర్ నుంచి ఇండిగో విమానంలో చెన్నైకి బుధవారం తిరిగొచ్చానని చెప్పుకొచ్చింది మాళవిక.
అయితే సోదాల పేరుతో తనతో చాలా అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది మాళవిక. వారి చర్యలు మొరటుగా ఉన్నాయని రాసుకొచ్చింది.
దీనిపై పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మాళవిక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తోన్న ప్రాజెక్టులో నటిస్తుంది.
మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్. తమిళంలో రజినీకాంత్ నటించిన పేట సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.
దళపతి విజయ్ 'మాస్టర్'లో.. ధనుష్ 'మారన్' హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది మాళవిక.
ప్రస్తుతం చియాన్ విక్రమ్ నటిస్తోన్న తంగలాన్ సినిమాలో నటిస్తుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.
తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లోనూ నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.