1st December 2023

ఎవరైనా నా చేతిని పట్టుకుంటారా ?..  మాళవిక పోస్ట్ వైరల్.. 

Pic credit - Instagram

మాళవిక మోహనన్ దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. తమిళం, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. 

అటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్. తన గ్లామరస్ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తూ అభిమానులతో సరదాగా గడుపుతుంటుంది. 

ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత హీరోయిన్‏గా మారింది. రజినీ నటించిన పేట సినిమాతో తెరంగేట్రం చేసింది. 

ఆ తర్వాత విజయ్ దళపతి నటించిన మాస్టర్ సినిమాలో నటించి అలరించింది. ఆ తర్వాత ధనుష్ జోడిగా మారన్ సినిమాలో నటించి అలరించింది. 

ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ చియాన్ నటిస్తోన్న తంగలాన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం కోలార్ లో షూటింగ్ జరపుకుంటుంది.

ఇందులో పార్వతి కథానాయికగా నటిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 26న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. 

ఈసినిమాలో మాళవికా తన పాత్రకు తనే డబ్బింగు చప్తోందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతాలలో చేస్తూ ఆసక్తకిర క్యాప్షన్ ఇచ్చింది మాళవిక. 

ఈ సినిమాలో అత్యంత కష్టమైన పని డబ్బింగ్ చెప్పడం అని.. డబ్బింగ్ చెబుతున్న సమయంలో తన చేతిని ఎవరైనా పట్టుకోగలరా అంటూ ట్వీట్ చేసింది.