ఈ వయ్యారి సోయగానికి ఆ సముద్రం కూడా ఆవిరి అవుతుందేమో..
TV9 Telugu
27 March 2024
4 ఆగస్టు 1993న ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లు అయినా కేరళ రాష్ట్రంలోని పయ్యనూర్ జన్మించింది మాళవిక మోహనన్.
కేరళలో జన్మించినప్పటి ముంబైలో పెరిగింది ఈ వయ్యారి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కుమార్తె ఈ బ్యూటీ.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని విల్సన్ కాలేజ్ నుంచి మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది ఈ వయ్యారి.
ఈ ముద్దుగుమ్మ తండ్రితో కలిసి ఓ యాడ్ షూటింగ్ వెళ్లగా.. ఈమెను చూసిన మమ్ముట్టి తన కొడుకును హీరోగా చేయనున్న తొలి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు.
ఆలా 2013లో దుల్కర్ సల్మాన్ సరసన పట్టం పోల్ అనే మలయాళీ రొమాంటిక్ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.
తర్వాత కొన్ని మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది ఈ అందాల భామ. అయితే ఇవి ఈమెకు గుర్తింపు ఇవ్వలేదు.
2019 పేటతో తమిళంలో అడుగు పెట్టినప్పటికీ మాస్టర్, మారన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారి.
ప్రభాస్ సరసన హీరోయిన్ గా రొమాంటిక్ హారర్ చిత్రం రాజాసాబ్ తో తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేయనుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి