ముత్యాలతో బొమ్మగా మలచి పుత్తడితో ప్రాణం పోసి ఆ బ్రహ్మ ఈమెను సృష్టించాడేమో..
TV9 Telugu
24 January 2024
4 ఆగస్టు 1993 సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని పయ్యనూర్ అనే ఓ ఊరులో జన్మించింది అందాల తార మాళవిక మోహనన్.
పుట్టింది కేరళలో అయినప్పటికీ ముంబైలో పెరిగింది. ఈ వయ్యారి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కూతురు.
తన తండ్రిని చూసి సినిమాటోగ్రాఫర్‌గా లేదా దర్శకురాలు కావాలనే ఆశతో ముంబైలోని విల్సన్ కాలేజీలో మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది.
గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆమె ఉన్నత చదువులు చదవాలని అనుకుంది. ఓసరి తన తండ్రితో కలిసి మమ్ముట్టి నటించిన ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ షూట్‌కి వెళ్లింది.
అప్పుడు మమ్ముట్టి తన కొడుకు దుల్కర్ సల్మాన్ సరసన మలయాళ చిత్రంలో కథానాయకిగా నటించమని మాళవికకు అడిగారు.
దీని కోసం కొంత సమయం తీసుకొని ఓకే చెప్పింది. దీంతో 2013లో పట్టం పోల్ అనే మలయాళీ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది.
తర్వాత రజినీకాంత్ పేట, విజయ్ దళపతి మాస్టర్ వంటి కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే ఈమె నటనకు అంత ప్రాధాన్యత లేదు.
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో వస్తున్న రాజాసాబ్ చిత్రం కథానాయకిగా ఈ వయ్యారి పేరు తరుచూ వినిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి