అందంలో ఆ తారలు కూడా ఈమెకు సరి తూగవేమో..

04 December 2023

ఆగస్టు 1993న కేరళ రాష్ట్రంలోని పయ్యనూర్ జన్మించింది అందాల తార మాళవిక మోహనన్. సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కుమార్తె ఈ భామ.

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఉన్న విల్సన్ కాలేజీలో మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది ఈ వయ్యారి భామ.

2013లో దుల్కర్ సల్మాన్ సరసన పట్టం పోలే అనే ఓ మలయాళీ రొమాంటిక్ చిత్రంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.

2016లో కన్నడ యాక్షన్ చిత్రం నాను మట్టు వరలక్ష్మితో శాండల్ వుడ్ లో కథానాయకిగా పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

2017లో బియాండ్ ది క్లౌడ్స్ అనే ఓ హిందీ డ్రామా సినిమాతో బాలీవుడ్ సినిమాలో తొలిసారి కథానాయకిగా మెప్పించింది.

2019లో రజినికాంత్ హీరోగా తెరకెక్కిన పేట అనే తమిళ చిత్రంలో ఓ పాత్రలో కోలీవుడ్ లో అడుగు పెట్టింది ఈ బ్యూటీ.

2021లో విజయ్ మాస్టర్, 2022లో ధనుష్ మారన్ చిత్రాల్లో తమిళ ఇండస్ట్రీలో నటించింది. ఈమెకు సినిమాల్లో స్కోప్ లేకపోయినా క్రేజ్ మాత్రం పీక్స్.

తెలుగులో ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న డీలక్స్ రాజా చిత్రంలో హీరోయిన్ నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.