17 August 2024
జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుత ప్రయాణం.. మాళవిక మోహనన్..
Rajitha Chanti
Pic credit - Instagram
స్టార్ హీరో విక్రమ్ నటించిన లేటేస్ట్ సినిమా తంగలాన్. ఇటీవల అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో కోలీవుడ్ హీరోయిన్ మాళివిక మోహనన్ ఆరతి పాత్రలో కనిపించారు.
తాజాగా మీడియాతో ముచ్చటించిన మాళవిక తంగలాన్ సినిమా అద్భుత ప్రయాణాన్ని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని.. విక్రమ్ గొప్ప నటుడు, ఈ సినిమా షూటింగ్ రోజులను గుర్తుంచుకుంటానని అన్నారు.
ఇలాంటి విభిన్నమైన, బలమైన పాత్రలను తెరకెక్కించడం సాహసం. ఈ మూవీ ఆగస్ట్ 30న హిందీలో రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి.
ఈ సినిమా హిందీలో రిలీజ్ అయ్యే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ఈ చిత్రాన్ని గొప్పగా చిత్రీకరించడానికి టీమ్ కష్టపడిందని అన్నారు.
ఆ కష్టాన్ని హిందీ అడియన్స్ కూడా ఆదరిస్తారని నమ్మకముందని తెలిపింది. త్వరలోనే రాజా సాబ్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు రానుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అందరికీ డార్లింగ్ అని.. కచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేసింది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.