టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకోవడానికి రెడీ అవుతోన్న ప్రభాస్ హీరోయిన్ 

Rajeev 

12 AUG 2024

సినిమాటోగ్రాఫర్‌ యుకె మోహనన్ కూతురు మాళవిక మోహనన్. ముంబైలోని విల్సన్ కాలేజీలో మాస్ మీడియా చేసిన ఈ బ్యూటీ.

మమ్ముట్టీతో యాడ్ షూట్‌కి వెళ్లి.. దుల్కర్ సల్మాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో ఆకట్టుకుంది. 

‘పట్టామ్ పోల్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కన్నడంలో ‘నన్ను మట్టు వరలక్ష్మీ’ సినిమాలు చేసింది.

 హిందీలో ‘బీయాండ్ ది క్లౌడ్స్’ అనే చిత్రంలో నటించింది. ఇక ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తుంది ఈ చిన్నది.

‘ది గ్రేట్ ఫాదర్’, ‘పేట’, ‘మాస్టర్’, ‘మారన్’ సినిమాల్లో నటించి.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది మాళవిక మోహనన్. 

2013లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. మంచి పాత్రలను ఎంచుకుంటూ.. ఆచితూచి ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది.

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.