12 September 2025
రాజా సాబ్ అప్డేట్ ఇచ్చేసిన మాళవిక.. ఫ్లోలో అసలు విషయం చెప్పేసిందిగా
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది మాళవిక మోహనన్. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
అంతకు ముందు పలు తమిళ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో నేరుగా తెలుగులోకి రాబోతుంది ఈ అమ్మడు.
రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ అప్డేట్స్ లీక్ చేసింది మాళవిక.
రాజాసాబ్ మూవీ ఛాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ చాలా అద్భుతమైన వ్యక్తి. వయసులో ఆయన నాకంటే పెద్దవాడు అని చెప్పుకొచ్చింది.
నాకంటే పెద్దవారు అయినా ఆయనను చూసినప్పుడు అలా అనిపించదు. చాలా సైలెంట్ గా ఉంటారు. సినిమా కోసం ఆయనతో పనిచేయం మధురంగా అనిపించింది.
సినిమా పూర్తైంది. కొన్ని పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. రాజాసాబ్ సినిమాలో మా ప్రయాణం చాలా అందంగా ఉంటుంది అని తెలిపింది ఈ వయ్యారి.
ప్రస్తుతం మాళవిక కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో మాళవిక పాటు నిధి అగర్వాల్, రద్దీ కుమార్ కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా తర్వలోనే అప్డేట్స్ ఇవ్వనున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్