52 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్లకు పోటీ.. మలైకా అందం రహస్యం ఇదే..
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మలైకా అరోరా ఒకరు. కథానాయికగా కాకుండా స్పెషల్ పాటలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇటీవలే రష్మిక మందన్నా నటించిన థామా చిత్రంలో స్పెషల్ పాటతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ పాటలో గ్లామర్ స్టెప్పులతో మరోసారి ఇండస్ట్రీలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ బ్యూటీ.
ఈ అమ్మడు వయసు 52 సంవత్సరాలు. ఈ వయుసులోనూ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ తో ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ అందం రహస్యం తెలుసా.. ?
మలైకా అందం విషయంలో ముఖ్యంగా మూడు మెయిన్ పిల్లర్స్ ఉంటాయట. మొదటిది క్వాలిటీ స్లీప్, రెండోది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, మూడోది స్ట్రాంగ్ మైండ్ బాడీ కనెక్షన్ అంటుంది.
మలైకా ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇంట్లో చేసిన వంటకాలకే ప్రాధాన్యత ఇస్తుంది. గుడ్లు, టోస్ట్, ప్రోటీన్ అధికంగా ఉంటే పదార్థాలను తీసుకుంటుందట
అలాగే రోజు పలురకాల వర్కవుట్స్, వ్యాయమాలు చేస్తుంది. యోగా, పిలేట్స్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి రోజూ ఉదయం కచ్చితంగా సూర్య నమస్కారం చేస్తుందట.
అలాగే డైట్ ను బ్యాలెన్స్ ఉంచుకోవడం కోసం ట్రావెల్ చేసేటప్పుడు సొంతంగా ఫుడ్ క్యారీ చేస్తుందట. కడుపు నిండుగా ఉన్నప్పుడు తాను అస్సలు వర్కువుట్స్ చేయదని అంటుంది.
మలైకా తన ఇన్ స్టాలో ఎక్కువగా యోగా, వర్కవుట్ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. అందులో కార్డియో, వెయిట్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయమాలు చేస్తూ కనిపిస్తుంటుంది.