డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే.. థి
యేటర్స్ లోకి రాజా సాబ్ వచ్చేది అప్పుడేనట !!
Phani CH
18 AUG 2024
బాహుబలి సినిమా తరువాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. దీంతో అన్ని పాన్ ఇండియా తరహా సినిమాలే చేస్తు వస్తున్నాడు రెబల్ స్ట
ార్ ప్రభాస్.
ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే.ఆ సినిమా థియేటర్లలో 50 రోజులు కంప్లిట్ చేసుకుంది కల్కి.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రాజా సాబ్’ లో నటిస్తున్నాడు.
ఈ చిత్రం హార్రర్, కామెడీ, రొమాంటిక్ సినిమాగా రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇప్పటికే రాజా సాబ్ చిత్రం నుంచి విడుదల అయినా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ది రాజా సాబ్ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసారు మేకర్స్. 2025 ఎప్రిల్ 10న విడుదల కానుంది ఈ చిత్రం.
రాజా సాబ్ ప్రమోషన్స్ ఊహించిన దానికంటే ఘనంగా ఉంటాయంటున్నారు మేకర్స్. దీనితో ఈ చిత్రం పై ఫ్యాన్స్ అంచనాలు మరింత పెరిగాయి.
ఇక్కడ క్లిక్ చేయండి