మూవీ అనౌన్సమెంట్స్ తో ట్రెండ్ సెట్ చేస్తున్న మేకర్స్..
17 October 2023
ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియం రేంజ్ సినిమాలపై ఆడియన్స్‌లో ఆసక్తి పెంచాలంటే దానికి చాలా జిమ్మిక్కులు చేయాల్సిందే. దర్శకులు ఇదే చేస్తున్నారిప్పుడు.
ముఖ్యంగా అనౌన్స్‌మెంట్ వీడియోలను షూట్ చేసి విడుదల చేస్తున్నారు. తాజాగా డిజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా తెలుసు కదా వీడియోను ఇలాగే విడుదల చేసారు మేకర్స్.
నీరజ కోన ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నీరజ.. ఇప్పుడు దర్శకురాలిగా మారుతున్నారు.