ఓటిటి కోసం మేకర్స్ కొత్త మంత్రం.. వారి ప్లాన్ ఏంటి.?
Prudvi Battula
10 February 2025
ఓటిటిని తక్కువగా అంచనా వేయడానికి లేదిప్పుడు. వందల కోట్ల వ్యాపారం అది.. నిర్మాతలకు అదనపు ఆదాయం కూడానూ.
మరి ఓటీటీ సంస్థలు అన్ని కోట్లు ఇస్తున్నపుడు సేమ్ సినిమా ఎందుకు ఇవ్వాలి..? ఇదే ఆలోచిస్తున్నారు మేకర్స్ ఇప్పుడు.
థియేటర్లో చూసినోళ్లు కూడా ఓటిటిలో చూసేలా కొత్త మంత్రంతో వస్తున్నారు. వెండితెరపై చూడని బొమ్మను బుల్లితెరపై చూపిస్తున్నారు.
స్టార్ హీరోల సినిమాలకు 100 నుంచి 250 కోట్ల మధ్యలో ఓటిటి రైట్స్ పలుకుతున్నాయి. అందుకే థియేటర్లో చూసిన సినిమా కాకుండా.. ఓటిటి కోసం కొత్త వర్షన్ ఇస్తున్నారు.
ఆ మధ్య జవాన్, లియో విషయంలో ఇదే చేసారు మేకర్స్. వాటివల్ల వ్యూవర్ షిప్ పెరిగింది. తాజాగా పుష్ప 2 సినిమాకు ఇలాంటి ఎక్స్‌టెండెడ్ ఓటిటి వర్షన్ ఇచ్చారు సుకుమార్.
థియేటర్లో రీ లోడెడ్ అంటూ 20 నిమిషాలు కలిపారు సుకుమార్.. ఓటిటి కోసం మరో 11 నిమిషాలు కలిపి రిలీజ్ చేసారు.
యానిమల్, అర్జున్ రెడ్డి సినిమాలకు ఇలాగే డైరెక్టర్స్ కట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా. ఈ ఫార్ములా సక్సెస్ అయింది కూడా.
ఇక హనుమాన్ ఇంటర్నేషనల్ వర్షన్ ఓటిటి కోసం సిద్ధం చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. మరికొన్నిసినిమాలకు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు.