మైదాన్ ట్రైలర్ విడుదల..

TV9 Telugu

03 April 2024

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్, ప్రియమణి జంటగా అమిత్ రవీంద్రనాథ్ శర్మ తెరకెక్కిస్తున్న సినిమా మైదాన్.

బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

రెండు మూడేళ్లుగా తరుచూ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఎప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ చిత్ర ఫైనల్ ట్రైలర్‌ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.

భారతదేశంలో క్రీడను విప్లవాత్మకంగా మార్చిన గౌరవనీయమైన ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర.

1952 నుండి 1962 మధ్య సాగిన ఈ చిత్రమిది. ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ చేసిన కృషిని ఈ సినిమాలో చూపించనున్నారు.

మైదాన్ షూటింగ్ 19 ఆగస్టు 2019న మదలైనప్పటికీ కోవిడ్-19 మహమ్మారి, నిసర్గా తుఫాను కారణంగా చాలా ఆలస్యం అయింది.

ఈ చిత్రం 3 జూన్ 2022న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా 23 జూన్ 2023కు వాయిదా పడింది. అప్పుడు కూడా మరోసారి వాయిదా పడింది.