మైదాన్ క్రేజీ ఆఫర్..
TV9 Telugu
14 April 2024
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్, ప్రియమణి జంటగా నటించిన బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం మైదాన్.
1952-1962 మధ్య భారతదేశంలో క్రీడ కోసం ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ చేసిన కృషిని ఈ చిత్రం వివరిస్తుంది.
అమిత్ శర్మ తెరకెక్కించిన ఈ జీ స్టూడియోస్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్ సంస్థల్లో ఆకాష్ చావ్లా, అరుణవ జాయ్ సేన్‌గుప్తా, బోనీ కపూర్ నిర్మించారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ బయోగ్రాఫికల్ చిత్రానికి సంగీతం అందించారు.
మూడేళ్లుగా ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకి 10 ఏప్రిల్ 2024న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం.
తాజాగా మైదాన్‌లో ఎక్కువ స్కోర్ చేయండి అంటూ క్రేజీ అనిపించే ఆఫర్‌ని ప్రకటించింది 'మైదాన్' మూవీ టీమ్.
మైదాన్ సినిమా కోసం ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అని ప్రకటించారు ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ మేకర్స్.
మౌత్ టాక్ బావున్నా, థియేటర్లలో జనాలు పలచగా ఉండటంతో, ఇలాంటి ఓ క్రేజీ ఆఫర్‌ని అనౌన్స్ చేసింది టీమ్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి