16 January 2024
ఆ విషయం పై పోలీసులను ఆశ్రయించి గుంటూరు కారం
TV9 Telugu
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్
సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలో రిలీజైంది.
సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోన్న గుంటూరు కారం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్లకు పైగా వసూళ్ల
ు సాధించింది.
అయితే గుంటూరు కారం సినిమాపై కొందరు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని చిత్ర బృందం ఆరోపిస్తోంది.
ఇదే విషయమై వారు సైబర పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
బుక్ మై షోలో సినిమాకు తక్కువ రేటింగ్ రావడం, కేవలం 70
వేల ఓట్లే పడడంపై ఆరా తీయాలని సైబర్ పోలీసులను కోరినట్లు సమాచారం.
ఫేక్ ఓటింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.