ఇలా నవ్వుకుని ఎన్నాళ్లైందో!

TV9 Telugu

16 March 2024

ఇలా నవ్వుకుని ఎన్నాళ్లైందో అని స్టార్ హీరో మహేష్‌ బాబు అంటుంటే, వినడానికి చాలా ముచ్చటేస్తోంది జనాలకు.

మరీ సూపర్ స్టార్ అభిమానాలు అయితే... మా సారు హ్యాపీ... మేం కూడా హ్యాపీ అని అంటున్నారు సోషల్ మీడియా వేదికగా.

ఇంతకీ మహేష్‌ అంత ఆనందంగా ఎందుకున్నారో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుందిగా...! యస్‌.. ప్రేమలు సినిమా చూశారట మహేష్‌.

మలయాళంలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ఆ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా తెలుగు వెర్షన్‌ని చూశారట ఈ హీరో.

థియేటర్ లో ప్రేమలు సినిమా చూసినంతసేపూ గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు.

ఇలా నవ్వుకుని ఎన్నాళ్లైందో అని అన్నారు. ఈ సినిమా చూస్తూ ఆయనతో పాటు ఇంటిల్లిపాదీ నవ్వుకుంటూనే ఉన్నారట.

ప్రేమలు సినిమాను తెలుగు వారికి చేరువ చేసినందుకు కార్తికేయను మెచ్చుకున్నారు సూపర్‌స్టార్‌ మహేష్ బాబు.

త్వరలోనే రాజమౌళి డైరక్షన్‌లో లుక్‌ టెస్ట్ కి అటెండ్‌ కావడానికి ప్రిపేర్‌ అవుతున్నారు ఘట్టమనేని స్టార్‌.