TV9 Telugu
మహేష్ బాబు బిజినెస్ మెన్.. ప్రశాంత్ నీల్ ఫేవరేట్ కెప్టెన్..
29 Febraury 2024
బిజినెస్ మెన్ అని ఒకప్పుడు పూరీ జగన్నాథ్ పెట్టిన టైటిల్‌కు పూర్తి న్యాయం చేస్తున్నారు హీరో మహేష్ బాబు.
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బిజినెస్‌పై ఫోకస్ చేసారు. ఇప్పటికే హైదరాబాద్‌లో AMB సినిమాస్ నిర్మించారు.
ఇప్పుడు సుదర్శన్ 70 ఎంఎం ప్లేస్‌లో AMB క్లాసిక్ నిర్మించబోతున్నారు. 7 స్క్రీన్ మల్టీప్లెక్స్‌గా ఇది రాబోతుంది.
దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి నటిస్తున్న మూడో సినిమా టైటిల్ ఖరారైంది. లవ్ మీ అనే పేరు దీనికి కన్ఫర్మ్ చేసారు.
ఘోస్ట్ లవ్ అనేది ట్యాగ్ లైన్. ఇందులో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్. అరుణ్ భీమవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా తనకు ఇష్టమైన దర్శకుడితో పాటు హీరో, హీరోయిన్ పేర్లు చెప్పారు.
ఓ కన్నడ షోలో తనకు ఉపేంద్ర దర్శకత్వం నచ్చుతుందని తెలిపారు. ఆయన చేసిన ఒక్కో సినిమా ఒక్కో మాస్టర్ పీస్ అన్నారు.
అంతేకాదు.. హీరోలలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, హీరోయిన్లలో శ్రీదేవి తన ఫేవరేట్ అన్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి