కొత్త లుక్ తో ఫ్యాన్స్‌కు ఝలక్ ఇచ్చిన మహేష్

TV9 Telugu

11 March 2024

ఎప్పటికప్పుడు అభిమానులకు షాక్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు మహేష్ బాబు. ఈయన ఇస్తున్న స్ట్రోక్స్‌కు పిచ్చెక్కిపోతున్నారు ఫ్యాన్స్. 

తాజాగా రాజమౌళి సినిమా విషయంలో మరో ఝలక్ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్. దాంతో అభిమానులకు మతులు పోతున్నాయి.

అసలు మహేష్ గురించి ఏ విషయంలో ఫ్యాన్స్‌ను అంతగా కంగారు పడుతున్నారో తెలుసా ?? మరి లేట్ ఎందుకు చూసేయండి.

మహేష్, రాజమౌళి సినిమాపై ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా.. అదే మహాప్రసాదం అన్నట్లు ఫీలవుతున్నారు మహేష్ ఫ్యాన్స్

ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడైనా రాని.. ముందు కొబ్బరికాయ్ కొట్టే రోజు కోసం వేచి చూస్తున్నారు వాళ్లు. ఇదిలా ఉంటే ఇందులో మహేష్ ఏ లుక్‌లో కనిపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

తాజాగా కొత్త లుక్‌లోకి మారిపోయారు సూపర్ స్టార్.చూస్తున్నారుగా.. నిన్నమొన్నటి వరకు గడ్డంతో ఫుల్ మాసీగా కనిపించిన మహేష్.. అప్పుడే మళ్లీ చిన్నపిల్లాడైపోయారు.

ఈయన్ని చూస్తుంటే ఏజ్ దాచేసే మిషన్ ఏదో ఆయన ఇంట్లో దాచుకున్నట్లు అనిపిస్తుంది. గుంటూరు కారం కోసం ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన మహేష్..