ఓటిటిలో గుంటూరు కారం.. బుల్లితెర సెన్సేషన్స్ మూవీస్..
TV9 Telugu
11 February 2024
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ గుంటూరు కారం. సంక్రాంతికి విడుదలై థియేటర్లలో 200 కోట్లకు పైగా వసూలు చేసింది.
తాజాగా ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చాడు రమణ గాడు. అక్కడ కూడా వచ్చీ రావడంతోనే రప్ఫాడిస్తున్నాడు. నెల రోజుల్లోనే డిజిటల్‌లోకి వచ్చేసింది.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ వ్యూహం సినిమాకు లైన్ క్లియర్ అయింది.
మూడు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న వ్యూహం సినిమా విడుదలకు ఎట్టకేలకు కోర్టు అనుమతి ఇచ్చింది.
దాంతో ఫిబ్రవరి 16న వ్యూహం సినిమా విడుదల కాబోతుంది. దాంతో సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు ఆర్జీవీ.
ఇటు బాలయ్య.. అటు రామ్ సినిమాలకు బుల్లితెరపై రికార్డ్ టిఆర్పీ రేటింగ్స్ రావడంతో పండగ చేసుకుంటున్నారు మేకర్స్.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరికి మొదటిసారి 9.3 రేటింగ్ వచ్చిందని మేకర్స్ చెప్పారు.
మరోవైపు బోయపాటి రామ్ కాంబోలో వచ్చిన స్కంద సినిమా 8.11 రేటింగ్ తెచ్చుకుంది. ఈ రెండూ ఊర మాస్ సినిమాలే కావడం గమనార్హం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి