TV9 Telugu

20 January 2024

చరిత్ర సృష్టించిన మహేష్‌ 200 కోట్ల క్లబ్‌లో.!

రమణగాడు.. రెచ్చిపోతున్నాడు. బాక్సీఫీస్‌ ను బద్దలు కొట్టేస్తున్నాడు,థియేటర్లను షేక్ చేస్తున్నాడు.

ఆ సినిమాపై వస్తున్న కొన్ని విమర్శల మధ్య ఏ హీరోకు సాధ్యం కానీ మేజిక్ చేసేశాడు.

గుంటూరు కారాన్ని వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లోకి చేర్చేశాడు.

తన పర్ఫార్మెన్స్‌తో తన యాక్టింగ్‌తో తన క్రేజ్‌ అండ్ మేనియాతో వరల్డ్‌ వైడ్ తెలుగు వాళ్లందర్నీ మడతెట్టేశాడు.

ఎస్! త్రివిక్రమ్‌ డైరెక్షన్లో మహేష్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం.

వీరిద్దరి ముచ్చటైన మూడో సారి కలయికలో వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలకు తగ్గట్టే కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది.

నయా హిస్టరీస్ను క్రియేట్ చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఓ ఆల్‌ టైం రికార్డును క్రియేట్ చేసింది.

జస్ట్ రిలీజైన వారంలోనే వరల్డ్‌ వైడ్ 212 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది. ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది.