21 November 2023

ధూం.. ధాంగా ధమ్‌ మసాలా సాంగ్.! మామూలుగా ఉండదు మరి!

సిల్వర్ స్క్రీన్ పై ఊర మాసు లుక్‌లో సూపర్ స్టార్ మహేష్.!

సూపర్ స్టార్ మహేష్ వెనకో 600  మంది ఊర మాసు డ్యాన్సర్స్‌.!  

థియేటర్లో ఉన్న స్పీకర్లు కూడా బద్దలయ్యే రేంజ్లో .. మోగిపోతున్న తమన్ బీట్! 

కట్ చేసే పూనకాలు వచ్చే రేంజ్ డ్యాన్స్! ఇంకేముంది.. థియేటర్ అట్టుడికిపోదూ.! 

ఇక ఇటీవల రిలీజ్ అయిన ధమ్‌ మసాలా సాంగ్‌ సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. 

దీంతో ఈ సాంగ్‌కు వచ్చిన క్రేజ్‌ను పరిగణలోకి తీసుకుని.. 

మహేష్ తో పాటు దాదాపు 600 మంది డ్యాన్సర్లతో.. పిక్చరైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్‌. 

అందుకోసం కొరయోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇప్పటికే.. దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్ కంపోజ్ చేసేశారట. 

ఇక షూటింగ్‌ రేపో మాపో మొదలెట్టి ఫినిష్ చేయడమే తరువాయట..