గుంటూరు కారం దూకుడు.. రవితేజ ట్వీట్ కి హరీష్ శంకర్ రిప్లై..

TV9 Telugu

18 January 2024

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం మిక్డ్స్ రివ్యూస్‌తో మొదలైనా కూడా ఆ తర్వాత మెల్లగా పుంజుకుంటుంది.

చాలామంది కుటుంబ ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తుండటంతో ఏపీ, తెలంగాణలో గుంటూరు కారం దూకుడు కొనసాగుతుంది.

4 రోజుల్లోనే ఈ చిత్రం 140 కోట్లకు పైగా గ్రాస్.. 85 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లోనూ 3 మిలియన్ మార్క్ అందుకుంది గుంటూరు కారం.

ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల కథానాయకిగా నటించింది. మరో హీరోయిన్ పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించింది.

రవితేజ, హరీష్ శంకర్ మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పనక్కర్లేదు. ఈ మధ్యే ట్విట్టర్‌లో రవితేజ ఓ ట్వీట్ చేసారు.. ఇండస్ట్రీలో ఎవరికీ ఎవరిపై నెగెటివిటీ ఉండదు..

ఒకవేళ ఉన్నా ఏదో ఓ శుక్రవారం దొరికేస్తారు.. ఎవడన్నా, పక్కోడి అపజయానికి సోలో డాన్స్ ఏస్తే, రేపు వాడి అపజయానికి గ్రూప్ డాన్సర్లు రెడీ అవుతారంటూ ట్వీట్ చేసారు రవితేజ.

దీనికి హరీష్ శంకర్ రిప్లై ఇస్తూ.. అన్నయ్య యువర్ రైట్ మారుతున్న ఆడియన్స్ టెస్ట్‌కి సర్దుకుంటూ పోవడం లేదా మొత్తం సర్దేసుకొని వెళ్ళిపోవడం అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం వీరిద్దిరి కాంబో వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. గతంలో షాక్, మిరపకాయ్ అనే రెండో చిత్రాలు వచ్చాయి.