గుంటూరు కారం సాంగ్ ట్రేండింగ్.. రకుల్ న్యూ ఫోటోషూట్..
TV9 Telugu
10 February 2024
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసించేసింది.
ఈ మధ్యే సినిమా నుంచి విడుదలైన కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ వీడియో సాంగ్‌కు అప్పుడే 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఆనంద్ దేవరకొండ హీరోగా బేబీ లాంటి కల్ట్ సినిమాను అందించిన నిర్మాత SKN తాజాగా మరో సినిమాను తీసుకొచ్చారు.
మణికందన్, శ్రీగౌరీ ప్రియ జంటగా ప్రభురామ్ వ్యాస్ తెరకెక్కించిన సినిమా ట్రూ లవర్. ఈ సినిమాకు సీన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు.
ఈ సినిమాను మారుతి, ఎస్‌కేఎన్ కలిసి తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఫిబ్రవరి 10న విడుదల కానుండగా.. ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేసారు మేకర్స్.
ఫిబ్రవరిలోనే పెళ్లి చేసుకోబోతున్నారు రకుల్ ప్రీత్ సింగ్. కానీ కెరీర్ పరంగా మాత్రం అదే జోరు చూపిస్తున్నారు.
తాజాగా ఈమె కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతుంది. ఈ మధ్య ఎక్కువగా వర్కవుట్స్ చేస్తున్నారు రకుల్.
దాంతో ఆమె లుక్‌పై ఆ ప్రభావం కనిపిస్తుందంటున్నారు ఫ్యాన్స్. రకుల్‌లో మునపటి గ్లామర్ లేదంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోషూట్‌పై కామెంట్స్ వస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి