గుంటూరు కరం వీడియో సాంగ్ రిలీజ్.. ‘ముఖ్య గమనిక’ మూవీ అప్డేట్..

TV9 Telugu

31 January 2024

అల్లు అర్జున్ బావమరిది విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న టాలీవుడ్ యాక్షన్ డ్రామా సినిమా ‘ముఖ్య గమనిక’.

వేణు మురళీధర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగమ్మాయి లావణ్య ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది.

తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించి ఓ మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసారు.

ఫిబ్రవరి 23న ముఖ్య గమనిక సినిమా థియేటర్స్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు మూవీ మేకర్స్. మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తారు.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయమే సాధించింది.

గుంటూరు కరం చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూలు చేసిందని ఈ మూవీ దర్శక నిర్మాతలు కూడా తెలిపారు.

తాజాగా ఈ యాక్షన్ డ్రామా చిత్రం సినిమా నుంచి దమ్ మసాలా అనే వీడియో సాంగ్‌ను విడుదల చేసారు మూవీ మేకర్స్.

ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ అప్పియరెన్స్, డ్యాన్సులు అయన అభిమానులను చాల బాగా అలరిస్తున్నాయి.