గుంటూరు కారం పాట విడుదల.. చిరుకి ప్రముఖులు శుభాకాంక్షలు..
TV9 Telugu
26 January 2024
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయమే సాధించింది.
200 కోట్లకు పైగా ఈ చిత్రం వసూలు చేసిందని మూవీ దర్శక నిర్మాతలు కూడా తెలిపారు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయక.
తాజాగా శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా గుంటూరు కారం సినిమా నుంచి అమ్మ పాటను విడుదల చేసారు మూవీ మేకర్స్.
ఇందులో మహేష్ బాబు అమ్మగా రమ్యకృష్ణ నటించారు. మహేష్ మరదలి పాత్రలో హీరోయిన్ మీనాక్షి చౌదరి కనిపించింది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంపై యావత్ తెలుగు సినిమా పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అందరూ పద్మ విభూషణ్ వచ్చిన కారణంగా చిరుకు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా ద్వారా తన మనసులో మాట అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భం తనకు ఎంతో అమూల్యమైందని.. ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి