TV9 Telugu
డిజిటల్‌లో దుమ్మురేపుతున్న మహేష్.. ఇన్నేళ్ల తర్వాత మురుగదాస్ సినిమా..
17 Febraury 2024
మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఫ్యామిలీ యాక్షన్ సినిమా గుంటూరు కారం.
ఈ సినిమాకు ఓటిటిలో ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే ఓ ప్రముఖ ఓటిటిలో విడుదలైంది గుంటూరు కారం.
గ్లోబల్‌గా నాన్ ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో తెలుగు వెర్షన్ టాప్ 6లో.. హిందీ వెర్షన్ టాప్ 10లో ట్రెండ్ అవుతుంది.
హాలీవుడ్ సినిమాల స్థాయిలో మహేష్ బాబు గుంటూరు కరం సినిమాకు డిజిటల్‌లో స్పందన వస్తుందని తెలిపారు మేకర్స్.
నాలుగేళ్ల కింద వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్బార్ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు మురుగదాస్.
తాజాగా కోలీవుడ్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తాను తర్వాత తెరకెక్కిచానున్న సినిమాను అధికారికంగా ప్రకటించారు.
కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్, రుక్మిని వసంత్ జంటగా ఈ సినిమాను రూపొందనుంది. మరిన్ని విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.
సప్త సాగరాలు దాటి సినిమాతో రుక్మిణి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి