TV9 Telugu
రమణగాడి ఘాటు@100 డేస్.. గుంటూరు కారం మూవీ శతదినోత్సవం.!
22 April 2024
2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ మాస్ మసాలా సినిమా గుంటూరు కారం.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ని అందుకుంది. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ ప్లస్ అనే టాక్ కూడా ఉంది.
ఈ సినిమాకి త్రివిక్రమ్ డైరెక్టర్ కాగా శ్రీలీల, మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా మెప్పించి మంచి బజ్ క్రియేట్ చేసారు.
ఇక ఇదే తరహాలో ఫిబ్రవరి 9 న ఓటీటీ లో రిలీజ్ అయ్యి హ్యూజ్ స్ట్రీమింగ్ వ్యూస్ తో మరో రికార్డు క్రియేట్ చేసింది.
తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
జనవరి 12న విడుదలైన ఈ సినిమా రెండు థియేటర్లలో 100 రోజులు ఆడింది. ఈ విషయాన్నీ మేకర్స్ ఆఫీషియల్ గా తెలిపారు.
చిలకలూరిపేటలోని వెంటేశ్వర థియేటర్‌లోనూ, కర్ణాటక ముల్బాగల్‌లోని నటరాజ థియేటర్‌లోనూ ఈ మార్కు చేరుకుంది.
ఈ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చిన కానీ ఈ రోజుల్లో 100 డేస్ ఆడటంపై మహేష్ బాబు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి