TV9 Telugu

31 January 2024

ఓటిటి లో గుంటూరోడి విధ్వంసం కోసం ఫ్యాన్స్‌ వెయిటింగ్.

సంక్రాంతి సందడి అయిపోయింది. హనుమాన్ మినహా సినిమాలన్నీ సైలెంట్ అయిపోయాయి.

సంక్రాంతి సినిమాలన్నీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్‌ గుంటూరు కారం కూడా ఓటీటీ బాట పట్టేందుకు రెడీ అవుతోందని టాక్. 

ఎన్నో అంచనాల మధ్య రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.

అలాంటి ఈ క్రేజీ సినిమా అతి తొందర్లో ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అవుతోంది.

ఫ్యాన్సీ రేట్‌కు ఈ సినిమాను దక్కించుకున్న ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ ఫ్లిక్స్‌ గుంటూరు కారం స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోందట.

ఫిబ్రవరి 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందట.

ఓటీటీ బాబు సృష్టించే విధ్వంసం కోసం.. ఆయన ఫ్యాన్స్‌ను ఎదురు చూసేలా చేస్తోంది కూడా.!