50 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడిలా.. మహేష్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనట
Rajitha Chanti
Pic credit - Instagram
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పేరు చెప్పగానే సినిమాలు, నటనతోపాటు అందం, ఫిట్‌నెస్ గుర్తుకువస్తాయి.
ప్రస్తుతం మహేష్ బాబు వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ అదే అందంతో కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు.
మహేష్ ఫిట్‌నెస్ గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతో ట్రై చేస్తుంటారు. తన డైట్, ఫిట్‌నెస్ విషయంలో మహేష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు
మహేష్ తన ఫిట్‌నెస్ సెషన్ ను ఉదయమే స్టార్ట్ చేస్తారు. దాదాపు గంటపాటు ఇంటెన్సివ్ వర్కౌట్స్ చేస్తారు. అలాగే బాడి టైప్ వర్కవుట్స్ చేస్తుంటారు.
తన ట్రైనర్ చెప్పిన వ్యాయామాలనే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. రెసిస్టెన్స్ ట్రైనింగ్,స్ట్రెంత్ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి వర్కవుట్స్ చేస్తాడు.
మహేష్ బాబు రోజుకు కనీసం 5 నుంచి 6 సార్లు తింటారట. ఏది పడితే అది కాకుండా తన శరీరానికి శక్తిని అందించే పోషకాహారం తీసుకుంటాడట.
కనీసం రెండు సార్లు సప్లిమెంట్ షేక్స్ తాగుతాడు. అలాగే తన శరీరానికి ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటాడు.
నట్స్, పండ్లు, ఆకు కూరలు తీసుకుంటారట. అలాగే చికెన్, ఫిష్, ఓట్స్, ఎగ్స్ తప్పనిసరిగా తన డైట్ లో ఉంటాయి. ఓట్స్, ఎగ్స్, ఫ్రూట్స్, నట్స్ తీసుకుంటాడు