TV9 Telugu
11 January 2024
గుంటూరోడి ఒక్కమాటతో అంచనాలు పెంచేసాడుగా.!
నిన్న వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉంది గుంటూరు కారం మూవీ పరిస్థితి.
మహేష్, త్రివిక్రమ్ కాంబో మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ స్పీచ్ విన్న తరువాత ఆ అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరాయి.
గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ ఎన్నడూ చూడనంత ఎమోషనల్‌గా కనిపించారు సూపర్ స్టార్.
ముఖ్యంగా తండ్రిని కోల్పోయిన తరువాత మొదటి సారి అభిమానులను అడ్రెస్ చేస్తూ మాట్లాడిన ప్రిన్స్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న అంటూ మహేష్ చెప్పిన మాటలకు అభిమానుల కళ్లు కూడా చెమర్చాయి.
సినిమా విషయంలోనూ మహేష్ స్పీడు అభిమానులకు కొండత నమ్మకాన్ని ఇచ్చింది.
సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్న సూపర్ స్టార్ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి