మహేష్ గారాల పట్టి సితార ఇప్పుడు ఏ క్లాస్ చదువుతుందో తెలుసా?
TV9 Telugu
20 July 2024
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని శనివారం (జులై 20) తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటోంది.
ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు,నెటిజన్లు మహేశ్ వారసురాలికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
ఇక హీరో మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ కూడా తమ కూతురికి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా కెరీర్ పరంగా తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తోన్న సితార ఘట్టమేనని ఇటీవల ఓ నగల దుకాణం యాడ్ లో నటించింది.
అలాగే మరో పక్క సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ చిన్న వయసులోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటోందీ స్టార్ కిడ్
ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం అమ్మానాన్నలతో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొంది సితార. అందులో ' ఏ క్లాస్ చదువుతున్నావు' అన్న ప్రశ్న ఎదురైంది.
దీనికి సితార సమాధానమిస్తూ.. 'ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అయిపోయింది. సెవెంత్ లోకి వెళ్తాను' అని చెప్పుకొచ్చింది.
మొత్తానికి ఇంత చిన్న ఏజ్ లోనే చాలా యాక్టివ్ గా ఉంటూ, సేవా కార్యక్రమాలు చేయడం చాలా గ్రేట్ అంటున్నారు మహేశ్ అభిమానులు, నెటిజన్లు.
ఇక్కడ క్లిక్ చేయండి..