సీనియర్ హీరో సుమంత్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈయన నటిస్తున్న సినిమాకు ‘మహేంద్రగిరి వారాహి’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు.
తాజాగా ఈ చిత్ర గ్లిమ్స్‌ను తాజాగా దర్శకుడు క్రిష్ విడుదల చేసారు. గ్లిమ్స్ ఆసక్తికరంగా ఉందని.. కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పారు దర్శకుడు క్రిష్.
మరోవైపు ట్విట్టర్ వేదికగా యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రంపై ఓ పోస్ట్ చేశారు.
విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ముందు ఈ సినిమాను డిసెంబర్ 8న విడుదల చేయాలనుకున్నారు.
కానీ షూట్‌లో ఆలస్యం కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది. 2023 నుంచి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తప్పుకుంది.
2024 మార్చ్ 8న విడుదల కానుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం. అదే రోజు రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ కూడా విడుదల కానుంది.
నాని హీరోగా శౌర్యు తెరకెక్కిస్తున్న సినిమా హాయ్ నాన్న. డిసెంబర్ 7న విడుదల కానుంది ఈ చిత్రం. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచేసారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేసారు. ఇందులో మరో హీరోయిన్‌గా శృతి హాసన్ కు సంబంధించిన వీడియోనే విడుదల చేసారు.