13 December 2023

తిక్క కుదిరింది.. లేకపోతే మెగాస్టార్‌తో గేమ్సా

లోకేష్ లియో సినిమాలో... దళపతి ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించిన మన్సూర్ అలీఖాన్.. 

కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో వెకిలి కామెంట్స్ చేశారు. 

త్రిషను రేప్‌ చేసే సీన్ ఉంటే బాగుండేదంటూ.. నోరు పారేసుకున్నాడు. 

దీంతో తీవ్ర విమర్శల పాలయ్యాడు. త్రిషతో పాటు కుష్బూ, మెగాస్టార్ చిరుకు కూడా కోపం తెప్పించాడు

త్రిషకు సారీ చెప్పి వివాదాన్ని ముగించాడనుకున్న మన్సూర్ మరో బాంబు పేల్చారు. 

త్రిష, కుష్భూ, మెగా స్టార్ చిరుపై పరువునష్టం దావా వేశాడు. ఇక తాజాగా ఈ దావాను విచారించిన మద్రాసు హైకోర్టు కొట్టేసింది. 

కొట్టేయడే కాదు.. మన్సూర్‌ అలీఖన్ పై సీరియస్ అయింది మొట్టికాయలేసింది.