దేవకన్యలా మెరిసిన ముద్దుగుమ్మ మడోనా సెబాస్టియన్..

Rajeev 

24 June 2024

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాతో పరిచయం అయ్యింది మడోనా సెబాస్టియన్. 

తొలి సినిమాతోనే ఈ అమ్మడు తన అందంతో ఆకట్టుకుంది. అలాగే నటన పరంగాను మడోనా సెబాస్టియన్ కు మంచి మార్కులు పడ్డాయి. 

ఆతర్వాత తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. 

చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేసింది. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ లో మెరిసింది. 

ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. 

ఇక సోషల్ మీడియాలో మడోనా సెబాస్టియన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మూడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్ స్టా లో. 

రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది ఈ వయ్యారి భామ.